భారతదేశం, అక్టోబర్ 30 -- దుల్కార్ సల్మాన్ నటిస్తున్న మూవీ కాంతా (Kaantha). ఇప్పుడీ సినిమా నుంచి రేజ్ ఆఫ్ కాంతా అంటూ టైటిల్ ట్రాక్ రిలీజైంది. తమిళం, తెలుగు కలగలిపి వచ్చిన ఈ పాట ప్రేక్షకులను ఇన్‌స్టాంట్ గా ఆకట్టుకుంది. పాత్రను వర్ణిస్తూ సాగిపోయిన ఈ సాంగ్, మ్యూజిక్, దుల్కార్ సల్మాన్ యాక్షన్ మూవీపై అంచనాలను పెంచేస్తోంది.

మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ నటిస్తున్న కాంతా మూవీ నుంచి ఆంథమ్ సాంగ్ రేజ్ ఆఫ్ కాంతా గురువారం (అక్టోబర్ 30) రిలీజైంది. ర్యాప్ స్టైల్లో ఈ ఆంథమ్ సాగింది. అయితే ముఖ్యంగా తమిళం, తెలుగు లిరిక్స్ కలగలిపి ఈ పాట రావడం విశేషం. ఈ రెండు రాష్ట్రాల ప్రేక్షకుల సంస్కృతి, భాషలు, ఎమోషన్స్ అన్నీ ఈ పాటలో కనిపించాయి.

ఈ సాంగ్ రిలీజ్ కాగానే వెంటనే వైరల్ గా మారిపోయింది. నిజానికి సాంగ్ టీజరే ఎంతో ఆసక్తి రేపింది. ఈ లిరికల్ వీడియో ఇప్పుడు సోషల్ ...