భారతదేశం, నవంబర్ 17 -- సెల్వమణి సెల్వరాజ్ దర్శకత్వంలో వచ్చిన రెట్రో డ్రామా 'కాంత' శుక్రవారం (నవంబర్ 14) థియేటర్లలో విడుదలైంది. దుల్కర్ సల్మాన్, భాగ్యశ్రీ బోర్సే, సముద్రఖని, రానా దగ్గుబాటి కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి తమిళం, తెలుగులో మిశ్రమ స్పందనలు రావడంతో మొదటి వారాంతంలో వసూళ్లలో కాస్త తగ్గుదల కనిపించింది. దుల్కర్ సల్మాన్ యాక్టింగ్ మాత్రం ఆడియన్స్ ను ఫిదా చేస్తోంది.

కాంతా బాక్స్ ఆఫీస్ కలెక్షన్

దుల్కర్ సల్మాన్ హీరోగా వచ్చిన లేెటెస్ట్ మూవీ కాంత వసూళ్లు షాకింగ్ గానే ఉన్నాయి. ఫస్ట్ వీకెండ్ లో ఈ మూవీ అదిరే ప్రదర్శన చేయలేకపోయింది. ట్రేడ్ వెబ్‌సైట్ సక్నిల్క్ ప్రకారం, 'కాంత' ఆదివారం భారతదేశంలో సుమారు రూ.3.87 కోట్ల నెట్ కలెక్షన్లు సొంతం చేసుకుంది. దీంతో ఫస్ట్ వీకెండ్ ముగిసే సరికి మూడు రోజుల్లో కలిపి ఇండియాలో వసూళ్లు రూ.13.22 కోట్లకు చేరు...