Hyderabad, మే 14 -- దుల్కర్ సల్మాన్.. తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేని పేరు. మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి కొడుకుగా ఇండస్ట్రీలోకి వచ్చినా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు. తెలుగులో వరుసగా నాలుగు హిట్స్ అందుకున్న హీరో. అలాంటి నటుడు మలయాళంలో కొన్ని అదిరిపోయే థ్రిల్లర్ సినిమాల్లో నటించాడు. అవేంటి? ఏ ఓటీటీలో చూడాలన్న వివరాలు తెలుసుకోండి.

దుల్కర్ సల్మాన్ 2022లో నటించిన మూవీ సెల్యూట్. ఈ సినిమా తెలుగులోనూ సోనీ లివ్, యూట్యూబ్ లలో స్ట్రీమింగ్ అవుతోంది. ఓ హత్య కేసులో ఓ అమాయకుడిని ఇరికించామన్న పశ్చాత్తాపంతో అసలు హంతకుడి కోసం వెతికే ఎస్ఐ అరవింద్ పాత్రలో దుల్కర్ అద్భుతంగా నటించాడు. ఈ సినిమాకు ఐఎండీబీలో 7 రేటింగ్ ఉంది.

చుప్ మూవీ

చుప్ కూడా 2022లో వచ్చిన క్రైమ్ థ్రిల్లర్ మూవీ. తప్పుడు రివ్యూలు ఇచ్చే నకిలీ ఫిల్మ్ క్రిటిక్స్ ను ...