భారతదేశం, నవంబర్ 25 -- దుల్కర్ సల్మాన్, భాగ్యశ్రీ బోర్సే లీడ్ రోల్స్ లో నటించిన మూవీ కాంత (Kaantha). ఈ తమిళ-తెలుగు మూవీ నవంబర్ 14న థియేటర్లలో రిలీజైంది. దుల్కర్ నటనకు ప్రశంసలు దక్కినా.. బాక్సాఫీస్ దగ్గర ఏమాత్రం ప్రభావం చూపలేకపోయింది. దీంతో ఈ సినిమా నెల రోజుల్లోపే డిజిటల్ ప్రీమియర్ కానున్నట్లు వార్తలు వస్తున్నాయి.

తమిళంతోపాటు తెలుగులోనూ ఒకేసారి రూపొందించిన సినిమా కాంత. తెలుగులో ఇప్పటి వరకూ ఫెయిల్యూర్ అన్నదే ఎరగని దుల్కర్ సల్మాన్ లీడ్ రోల్లో నటించిన సినిమా కావడంతో భారీ అంచనాల మధ్య వచ్చింది. అయితే ప్రేక్షకుల ఆదరణ మాత్రం దక్కించుకోలేకపోయింది. దీంతో ఈ మూవీని నాలుగు వారాల్లోనే ఓటీటీలోకి తీసుకురావాలని నెట్‌ఫ్లిక్స్ భావిస్తోంది.

ఆ లెక్కన డిసెంబర్ 12న ఈ సినిమాను స్ట్రీమింగ్ చేయనున్నట్లు ఓటీటీప్లే రిపోర్టు తెలిపింది. తెలుగు సహా దక్షిణాది భాషలన్నీ...