భారతదేశం, నవంబర్ 20 -- నటి భాగ్యశ్రీ బోర్సే 'కాంత' మూవీలో దుల్కర్ సల్మాన్‌పై చేయిచేసుకునే సీన్ గురించి మాట్లాడింది. అందులో తాను అతన్ని కొట్టడానికి సంకోచించినట్లు చెప్పింది. భాగ్యశ్రీ.. దర్శకుడు సెల్వమణి సెల్వరాజ్ తో కలిసి ఇచ్చిన ఒక కొత్త ఇంటర్వ్యూలో.. 'కాంత' సినిమాలోని ఒక సీన్ గురించి షేర్ చేసుకుంది. ఈ సీన్ లో ఆమె పాత్ర దుల్కర్ సల్మాన్ పాత్రను కొట్టవలసి వచ్చింది.

దుల్కర్ సల్మాన్, భాగ్యశ్రీ కలిసి నటించిన కాంత మూవీ నవంబర్ 14న థియేటర్లలో రిలీజైన విషయం తెలుసు కదా. ఈ సినిమాలో చేయిచేసుకునే సీన్స్ ఉన్నప్పటికీ దుల్కర్ పాత్రను కొట్టే సీన్ లో తాను సంకోచించానని భాగ్యశ్రీ తెలిపింది. "తెర వెనుక అలా చేయడానికి నేను కొంచెం వెనుకాడాను. కానీ ఆ పర్ఫెక్షన్ ను అతను (దుల్కర్) కోరుకున్నాడని నేను అనుకుంటున్నాను.

ఆ నటనను నా నుండి వెలికితీయడానికి అతను దానిని అను...