భారతదేశం, డిసెంబర్ 31 -- విజయవాడ కనకదుర్గమ్మ భక్తులకు ఆలయ అధికారులు ముఖ్యమైన విషయాన్ని తెలిపారు. అది ఏంటంటే ఇంద్రకీలాద్రిపై అమ్మవారి భక్తుల సౌకర్యార్థం ఆలయం అధికారులు కీలక సంస్కరణలను అమలు చేస్తున్నారు. దర్శనం, ప్రసాద పంపిణీ వ్యవస్థలో సమయం ఆదా, పారదర్శకత, దుర్వినియోగాన్ని నియంత్రించడాన్ని లక్ష్యంగా మార్పులు తీసుకొస్తున్నారు. ఇక మీద రూ.500 అంతరాలయ దర్శన టికెట్ తీసుకున్న భక్తులకు ఉచిత లడ్డూను దర్శనానికి ముందు, టికెట్ స్కానింగ్ పాయింట్ దగ్గర పంపిణీ చేస్తారు. టికెట్ స్కాన్ అయిన వెంటనే భక్తులకు లడ్డూ చేతికి అందచేసే విధానాన్ని ఆలయ బోర్డు అమల్లోకి తెచ్చింది.

భక్తుల సౌకర్యాన్ని మెరుగుపరచడానికి, పారదర్శకతను నిర్ధారించడానికి ఇంద్రకీలాద్రి కనకదుర్గ ఆలయ యాజమాన్యం ప్రసాద పంపిణీ కోసం ఈ కొత్త వ్యవస్థను ప్రకటించింది. రూ.500 అంతరాలయ దర్శన టికెట్ కొనుగోలు ...