భారతదేశం, డిసెంబర్ 25 -- దురంధర్ తో కలెక్షన్ల పోరుకు సై అంటోంది యానిమల్ మూవీ. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో వచ్చిన యానిమల్ సినిమా కలెక్షన్లను దురంధర్ దాటేసింది. దీంతో దురంధర్ ను మళ్లీ వెనక్కి నెట్టేలా యానిమల్ డైరెక్టర్ సందీప్ పెద్ద ప్లాన్ వేశాడు. యానిమల్ సినిమాను జపాన్ లో రిలీజ్ చేయబోతున్నారు.

అధికారిక ప్రకటన వచ్చేసింది! సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో వచ్చిన 'యానిమల్' సినిమా రెండేళ్ల తర్వాత మళ్ళీ థియేటర్లలో సందడి చేయనుంది. అయితే ఈసారి ఈ చిత్రం జపాన్‌ లో మాత్రమే రిలీజ్ కానుంది. ఇటీవల కాలంలో భారతీయ సినిమాలకు జపాన్‌లో మంచి ఆదరణ లభిస్తున్న నేపథ్యంలో యానిమల్ ను అక్కడ రిలీజ్ చేస్తున్నారు.

సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంతో రణ్‌బీర్ కపూర్ హీరోగా వచ్చిన యానిమల్ జపాన్ లో భారీగా రిలీజ్ కానుంది. 2026, ఫిబ్రవరి 13న అక్కడి థియేటర్లలో విడుదల కానుంది. ఈ ...