భారతదేశం, డిసెంబర్ 14 -- బాలీవుడ్ స్టార్ హీర రణ్‌వీర్ సింగ్ నటించిన స్పై యాక్షన్ థ్రిల్లర్ 'ధురంధర్' బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. తొమ్మిది రోజుల్లోనే ఈ చిత్రం రణ్‌వీర్ సింగ్ బ్లాక్‌ బస్టర్ హిట్ 'సింబా' లైఫ్‌టైమ్ కలెక్షన్లను బద్దలుకొట్టింది.

దురంధర్ సినిమా మొత్తం ప్రపంచవ్యాప్తంగా రూ. 446.25 కోట్లు వసూలు చేసింది. దీంతో ధురంధర్ సినిమా ప్రస్తుతం రూ. 500 కోట్ల మార్క్‌ వైపునకు దూసుకుపోతోంది. అంతేకాకుండా త్వరలోనే రజనీకాంత్ 'కూలీ (రూ. 518 కోట్లు)', సూపర్ హిట్ 'సయ్యారా (రూ. 569.75 కోట్లు)' చిత్రాల రికార్డులను కూడా బ్రేక్ చేసే అవకాశం ఉంది.

సక్నిల్క్ (Sacnilk) నివేదికల ప్రకారం 'ధురంధర్' ఇండియాలో రెండో శుక్రవారం, శనివారం అత్యుత్తమ కలెక్షన్లను నమోదు చేసింది. రెండో శుక్రవారం (డిసెంబర్ 12) ధురంధర్ సినిమాకు రూ. 32.5 కోట్ల నెట్ కలెక్షన్స్ వచ్చాయి. అలాగ...