భారతదేశం, డిసెంబర్ 17 -- రణ్‌వీర్ సింగ్ లేెటెస్ట్ స్పై థ్రిల్లర్ దురంధర్ వసూళ్ల సునామీ సృష్టిస్తోంది. కలెక్షన్ల మోత మోగిస్తోంది. రెండో వారంలోనూ ఈ చిత్రం రికార్డు కలెక్షన్లు సాధిస్తోంది. భారీ వసూళ్లతో రికార్డులు ఖాతాలో వేసుకుంటుంది. రెండో వారాంతం తర్వాతి వారపు రోజుల్లో కూడా ఈ రణ్‌వీర్ సింగ్ చిత్రం నిలకడగా కొనసాగుతోంది.

దురంధర్ మూవీ కలెక్షన్లలో కొత్త మైల్ స్టోన్లు అందుకుంటుంది. మంగళవారం (డిసెంబర్ 17) నాటికి దాదాపు ఎటువంటి క్షీణత లేకుండా బాక్సాఫీస్ దగ్గర దూసుకుపోతోంది. దీంతో ఈ చిత్రం రికార్డు సమయంలో ఇండియాలోనే రూ.400 కోట్ల మార్కును అధిగమించింది. దురంధర్ తన రెండో వారాంతంలో భారతదేశంలో రూ.140 కోట్లకు పైగా నికర లాభాలను ఆర్జించింది. ఇది హిందీ చిత్రాలకు కొత్త రికార్డు.

సోమవారం దురంధర్ చిత్రం రూ.29 కోట్లు జోడించింది. మంగళవారం కూడా ఇదే ఊపును కొనసా...