భారతదేశం, డిసెంబర్ 20 -- బాక్సాఫీస్ సంచలనంగా మారిన దురంధర్ సినిమా రికార్డుల వేట కొనసాగిస్తోంది. మరో కొత్త రికార్డును ఈ స్పై థ్రిల్లర్ ఖాతాలో వేసుకుంది. ఇండియాలో అత్యంత త్వరగా రూ.500 కోట్ల కలెక్షన్లు సాధించిన సినిమా దురంధర్ నిలిచింది. రణ్‌వీర్ సింగ్ హీరోగా నటించిన దురంధర్ చరిత్ర తిరగరాస్తూనే ఉంది.

కలెక్షన్ల పరంగా రణ్‌వీర్ సింగ్ లీడ్ రోల్ ప్లే చేసిన దురంధర్ మూవీ మరో రికార్డు నెలకొల్పింది. ఇండియాలో అతి తక్కువ రోజుల్లో రూ.500 కోట్ల వసూళ్లు సాధించిన సినిమాగా నిలిచింది. ఈ విషయాన్ని దురంధర్ సినిమా మేకర్స్ అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. 15 రోజుల్లో ఈ చిత్రం ఇండియాలో రూ.503.20 కోట్ల గ్రాస్ కలెక్షన్లు ఖాతాలో వేసుకుందని సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. ఫాస్టెస్ట్ రూ.500 కోట్ల సినిమా ఇదేనని పేర్కొన్నారు.

డిసెంబర్ 5న థియేటర్లలో రిలీజైన దురంధర్ మూవీ కలెక...