భారతదేశం, డిసెంబర్ 20 -- ప్రస్తుతం భారతీయ చిత్ర పరిశ్రమలో 'ధురంధర్' పేరు మారుమోగిపోతోంది. సామాన్య ప్రేక్షకుల నుంచి సినీ దిగ్గజాల వరకు ప్రతి ఒక్కరూ ఈ సినిమాను ప్రశంసల్లో ముంచెత్తుతున్నారు.

తాజాగా ఈ జాబితాలో 'అర్జున్ రెడ్డి', 'కబీర్ సింగ్', 'యానిమల్' వంటి సంచలన చిత్రాల దర్శకుడు సందీప్ రెడ్డి వంగా చేరారు. దురంధర్ సినిమా చూసిన తర్వాత తన మనసులోని భావాలను సందీప్ రెడ్డి ఎక్స్ వేదికగా పంచుకున్నారు.

'ధురంధర్' చిత్రంపై సందీప్ రెడ్డి వంగా తనదైన శైలిలో స్పందించారు. "ఎక్కువగా మాట్లాడకుండా, బలమైన ఆత్మవిశ్వాసంతో ఉండే ఒక ధీరుడిలా ఈ సినిమా ఉంది. 'ధురంధర్' అనే టైటిల్‌కు తగ్గట్టుగానే సినిమా ఆద్యంతం ఎంతో గంభీరంగా, పవర్‌ఫుల్ గమనంతో సాగింది" అని సందీప్ రెడ్డి వంగా రాసుకొచ్చారు.

"ఎక్కడా గందరగోళం లేకుండా మేకర్స్ చాలా స్పష్టమైన విజన్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కిం...