భారతదేశం, జూన్ 22 -- ఆమీర్ ఖాన్ లేటెస్ట్ బాలీవుడ్ ఫిల్మ్ 'సితారే జమీన్ పర్' మూవీ కలెక్షన్లలో దూసుకుపోతోంది. పాజిటివ్ టాక్ తో ఈ మూవీ కోట్లు కొల్లగొట్టింది. శుక్రవారం (జూన్ 20) ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రిలీజైంది. ఈ సినిమా రెండు రోజుల్లో ఎన్ని కోట్లు కొల్లగొట్టిందో ఇక్కడ చూసేయండి.

ఆర్ ఎస్ ప్రసన్న డైరెక్షన్ లో వచ్చిన సితారే జమీన్ పర్ సినిమాలో ఆమీర్ ఖాన్, జెనీలియా దేశ్ ముఖ్ జంటగా నటించారు. తారే జమీన్ పర్ కు సీక్వెల్ గా తెరకెక్కిన ఈ చిత్రం కేవలం రెండు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.50 కోట్ల గ్రాస్ వసూలు చేసి హిట్ కొట్టిందని సక్నిల్క్ వెబ్ సైట్ తెలిపింది. వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ ట్రేడ్ వెబ్ సైట్ ప్రకారం సితారే జమీన్ పర్ ఇండియాలో రూ.30.90 కోట్ల నెట్, రూ.37 కోట్ల గ్రాస్ వసూలు చేసింది.

ఓవర్సీస్ లో రూ.13 కోట్లు కలెక్ట్ చేసిన ఈ సినిమా రెండు రోజుల్ల...