భారతదేశం, డిసెంబర్ 19 -- టాటా సియెర్రా ఎస్​యూవీ హిట్​ అవ్వడంతో టాటా మోటార్స్​ మంచి జోరు మీద ఉంది! బుకింగ్స్​ ప్రారంభమైన తొలి రోజే 70వేలకుపైగా మంది కస్టమర్లు ఈ ఎస్​యూవీని బుక్​ చేసుకోవడం ఆటోమొబైల్​ పరిశ్రమలో టాక్​ ఆఫ్​ ది టౌన్​గా మారింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఫోకస్​ టాటా సియెర్రా ఎలక్ట్రిక్​ వర్షెన్​పై షిఫ్ట్​ అయ్యింది! టాటా సియెర్రా ఈవీని సంస్థ రెడీ చేస్తున్న విషయం తెలిసిందే. ఇది 2026లో లాంచ్​ అవుతుందని తెలుస్తోంది. అంతేకాదు, భారతీయ ఆటోమొబైల్ దిగ్గజం 2026 సంవత్సరానికి భారీ ప్రణాళికలనే రచిస్తోంది! 2026లో లాంచ్​కు రెడీ అవుతున్న టాటా కార్ల వివరాలను ఇక్కడ చూసేయండి..

1. టాటా పంచ్ ఫేస్‌లిఫ్ట్-

ఇండియాలో బెస్ట్​ సెల్లింగ్​ ఎస్​యూవీల్లో ఒకటైన టాటా పంచ్​కి ఫేస్​లిఫ్ట్​ వర్షెన్​ రాబోతోంది. టెస్ట్​ మోడల్​కి సంబంధించి ఇప్పటికే అనేక స్పై షాట్స్​ ఆన్​ల...