భారతదేశం, జూలై 30 -- చిన్న సినిమాగా ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన 'సైయారా' (Saiyaara) మూవీ బాక్సాఫీస్ ను షేక్ చేస్తోంది. పెద్ద పెద్ద సినిమాలను వెనక్కి నెట్టేసింది. బడా బడా స్టార్లకు సాధ్యం కాని రికార్డును ఖాతాలో వేసుకుంది. కలెక్షన్లలో అదరగొడుతోంది. థియేటర్లలోకి వచ్చినప్పటి నుంచి కలెక్షన్ల దుమ్ము రేపుతూనే ఉంది. ఇండియాలోనే అత్యధిక కలెక్షన్లు సాధించిన లవ్ స్టోరీగా హిస్టరీ క్రియేట్ చేసింది.

మోహిత్ సూరి దర్శకత్వంలో వచ్చిన సైయారా చిత్రం ప్రపంచ బాక్సాఫీస్ వద్ద చరిత్ర సృష్టించింది. కేవలం 11 రోజుల్లోనే ఈ రొమాంటిక్ డ్రామా ప్రపంచవ్యాప్తంగా రూ.404 కోట్ల భారీ గ్రాస్ కలెక్షన్లు రాబట్టింది. తద్వారా భారతీయ సినిమా చరిత్రలో అత్యధిక వసూళ్లు సాధించిన ప్రేమకథా చిత్రంగా నిలిచింది. అహాన్ పాండే, అనీత్ పడ్డా నటించిన సైయారా.. షాహిద్ కపూర్ సినిమా కబీర్ సింగ్ (రూ.3...