భారతదేశం, ఏప్రిల్ 20 -- ఒకప్పుడు కేసీఆర్‌కు నమ్మినబంటు కొత్త ప్ర‌భాక‌ర్ రెడ్డి. బీఅర్ఎస్ పార్టీ నుండి 2014, 2019 లో మెద‌క్ పార్ల‌మెంట్ నుండి భారీ మెజారీటీతో విజ‌యం సాధించారు. రెండు ప‌ర్యాయాలు మెద‌క్ ఎంపీగా పనిచేసినా త‌ర్వాత.. 2023లో దుబ్బాక నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేశారు. ఈ ఎన్నిక‌ల ప్ర‌చార స‌మ‌యంలో కొత్త ప్ర‌భాక‌ర్ రెడ్డిపై జ‌రిగిన క‌త్తి దాడి.. తెలంగాణ వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించింది. ఈ దాడి కార‌ణంగా ప్ర‌భాక‌ర్ రెడ్డి ప్రచారానికి దూరంగా ఉన్న‌ా.. భారీ మెజార్టీతో విజ‌యం సాధించారు.

2024లో జ‌రిగిన పార్ల‌మెంట్ ఎన్నిక‌ల్లో బీజేపీ అభ్య‌ర్ధిగా రఘునంద‌న్ రావు బ‌రిలో నిలిచారు. ఆయన దుబ్బాక స్థానికుడు. అయినా ఈ నియోజ‌క‌వ‌ర్గం నుంచి బీఆర్ఎస్ పార్టీకి సుమారు 15 వేల మెజార్జీ వచ్చింది. ఈ ఎన్నికల్లోనూ ప్రభాకర్ రెడ్డి త‌న ప‌ట్టును నిలుపుకున్నారు. సిద్దిప...