భారతదేశం, నవంబర్ 21 -- దుబాయ్ ఎయిర్ షోలో అనుకోని ప్రమాదం జరిగింది. భారత్ కు చెందిన తేలికపాటి యుద్ధవిమానం తేజస్ కూలిపోయింది. స్థానిక కాలమానం ప్రకారం మధ్యాహ్నం 2 గంటలకు ఈ ప్రమాదం జరిగింది. ఎయిర్‌షోలో విన్యాసాలు చేస్తుండగా ఒక్కసారిగా తేజస్‌ కూలిపోయి భూమిని తాకింది. దీంతో భారీగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో పైలట్ ప్రాణాలు కోల్పోయాడు.

ఈ ఘటన భారత వైమానిక విభాగం స్పందించింది. "ఈరోజు దుబాయ్ ఎయిర్ షోలో వైమానిక ప్రదర్శన సందర్భంగా IAF తేజస్ విమానం ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో పైలట్ తీవ్రంగా గాయపడి.. ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనపై IAF తీవ్ర విచారం వ్యక్తం చేస్తోంది. పైలెట్ కుటుంబానికి అండగా ఉంటాం. ప్రమాదానికి గల కారణాన్ని తెలుసుకోవడానికి కోర్టు ఆఫ్ ఎంక్వైరీని ఏర్పాటు చేస్తున్నాం" అని ప్రకటన విడుదల చేసింది.

వైమానిక ప్రదర్శనలో భాగంగా తేజస్ యుద్ధ విమానం...