భారతదేశం, ఏప్రిల్ 15 -- దుబాయ్‌లో ఇద్దరు తెలంగాణ వ్యక్తులను ఓ పాకిస్థానీ యువకుడు కత్తితో పొడిచి చంపిన విషయం కలకలం రేపుతోంది. నిర్మల్ జిల్లా సోన్ కు చెందిన ప్రేమ్ సాగర్(40), నిజామాబాద్ జిల్లాకు చెందిన శ్రీనివాస్ దుబాయ్ లోని ఓ బేకరీలో పనిచేస్తు్న్నారు. అదే బేకరీలో పనిచేస్తున్న ఓ పాకిస్థానీ యువకుడు మతవిద్వేషంతో వీరిద్దరిని దారుణంగా నరికి చంపాడు. ఈ దాడిలో మరో ఇద్దరు తెలుగు వారు గాయపడిట్లు తెలుస్తోంది. గత శుక్రవారం ఈ ఘటన జరగ్గా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

దుబాయ్ లో తెలంగాణ వ్యక్తులపై జరిగిన దాడి ఘటనపై కేంద్రమంత్రి జి.కిషన్ రెడ్డి స్పందించారు. ఈ విషయంపై కిషన్ రెడ్డి కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్‌కు లేఖ రాశారు.

"పొట్టకూటి కోసం దుబాయ్ వలస వెళ్లిన ఇద్దరు తెలంగాణ వ్యక్తులు హత్యకు గురయ్యారన్న వార్త దిగ్భ్రాంతికి గురి చేసింది. పాకిస్థాన్‌కు ...