భారతదేశం, నవంబర్ 24 -- అల్లు అర్జున్, అల్లు స్నేహా రెడ్డి ముద్దుల కూతురు అల్లు అర్హ 9 ఏళ్ల పూర్తి చేసుకొని పదో ఏట అడుగుపెట్టింది. అయితే ఆమె బర్త్ డే వేడుకలు ఇండియాలో కాకుండా దుబాయ్‌లో జరగడం విశేషం. ఈ ఫొటోలను స్నేహ ఇన్‌స్టాగ్రామ్ లో సోమవారం (నవంబర్ 24) షేర్ చేయగా.. అవి వైరల్ గా మారాయి.

అల్లు అర్జున్ కూతురు అల్లు అర్హ బర్త్ డే సెలబ్రేషన్స్ కు సంబంధించిన ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాను ఊపేస్తున్నాయి. ఆమె పుట్టిన రోజు వేడుకల కోసం ఫ్యామిలీ దుబాయ్ వెళ్లడం విశేషం. ఈ ఫొటోలు, వీడియోలను స్నేహ షేర్ చేసింది. "తొమ్మిది సంవత్సరాల గ్రేస్, స్వీట్‌నెస్, అత్యంత మ్యాజికల్ ఆరా.. వాటర్ ఫన్, కేకులు, మాల్ షాపింగ్ - నిన్ను సెలబ్రేట్ చేసుకోవడం స్వచ్ఛమైన ఆనందం. మై బేబీ గర్ల్.. నువ్వు ప్రతి క్షణాన్ని మెరిసేలా చేస్తావు" అనే క్యాప్షన్ తో స్నేహ ఈ స్పెషల్ మూమెంట్స్ ను అ...