భారతదేశం, జూన్ 6 -- బాలీవుడ్ నటుడు ముజామిల్ ఇబ్రహీం సంచలన వ్యాఖ్యలు చేశాడు. స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణేతో లవ్, డేటింగ్, రొమాంటిక్ రైడ్స్ గురించి హాట్ కామెంట్లు చేశాడు. ఓ ఇంటర్వ్యూలో సంచలన విషయాలు వెల్లడించాడు. అతను చేసిన కామెంట్లు ఇప్పుడు తెగ వైరల్ గా మారాయి. తీవ్ర చర్చకు దారితీశాయి.

నటుడు ముజామిల్ ఇబ్రహీం తాజా ఇంటర్వ్యూలో దీపికా పదుకొణేతో రెండేళ్లు ప్రేమలో ఉన్నట్లు వెల్లడించాడు. సిద్ధార్థ్ కన్నన్ తో ఇంటర్వ్యూ స్టార్టింగ్ లో దీపికాతో రిలేషన్ గురించి చెప్పేందుకు ముజామిల్ కాస్త సంకోచించాడు. దీపికా ఇప్పుడు వివాహం చేసుకున్నందున మాట్లాడటానికి ఆలోచించాడు. కానీ ఆ తర్వాత అన్ని డీటెయిల్ గా చెప్పాడు. 'క్యూట్' డేట్స్ గురించి కూడా వివరించాడు. డేటింగ్ కు సంబంధించిన అన్ని విషయాలూ చెప్పాడు.

దీపికా, ముజామిల్ మోడల్స్ గా ఉన్నప్పుడు కలిశారని తెలిసింది....