భారతదేశం, జనవరి 14 -- సినిమా రంగంలో గంటల తరబడి షూటింగ్‌లు చేయడం, విశ్రాంతి లేకుండా పని చేయడం అనే సంస్కృతిపై ఇప్పుడు తారలు గొంతు విప్పుతున్నారు. ఇంతకుముందు దీపికా పదుకొణె లాంగ్ షిఫ్టుల విషయంలో తన అభ్యంతరాన్ని వ్యక్తం చేయడం పెద్ద కాంట్రవర్సీగా మారిన విషయం తెలిసిందే.

ఇప్పుడు దీపికా పదుకొణె బాటలో మరో హీరోయిన్, విలక్షణ నటి రాధిక ఆప్టే పయనిస్తున్నారు. తెలుగులో బాలకృష్ణతో లెజెండ్, లయన్ సినిమాల్లో హీరోయిన్‌గా చేసిన రాధిక ఆప్టే పని గంటల విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని తెగేసి చెబుతున్నారు.

తాజాగా ఫిల్మ్‌ఫేర్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రాధిక ఆప్టే సినిమా ఇండస్ట్రీలోని పని వాతావరణంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. "సినిమా రంగంలో తల్లిదండ్రులకు అనుకూలమైన వాతావరణం ఉండాలి. వారం మొత్తం తన బిడ్డను చూడకుండా ఎవరైనా ఎలా పని చేయగలరు? నేను లాంగ్ షిఫ్టులు చేయనని చెప్ప...