భారతదేశం, అక్టోబర్ 7 -- సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్ లో తెరకెక్కే స్పిరిట్ మూవీ షూటింగ్ కు ముందే వివాదాలు మొదలైన సంగతి తెలిసిందే. మూవీ నుంచి హీరోయిన్ గా దీపికా పదుకొణెను తప్పించడం సంచలనంగా మారింది. ఆమె ప్లేస్ లో త్రిప్తి డిమ్రిని హీరోయిన్ గా తీసుకున్నాడు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా. అయితే ఇప్పుడు దీపికాకు సంబంధించిన వీడియోను త్రిప్తి లైక్ చేయడం హాట్ టాపిక్ గా మారింది.

ఇటీవల దీపికాను సమర్థిస్తూ వచ్చిన ఓ సోషల్ మీడియా రీల్‌ వైరల్ గా మారింది. దీపికా పదుకొణె వృత్తి నైపుణ్యాన్ని త్రిప్తి మెచ్చుకున్నారు. సెలబ్రిటీ చీర స్టైలిస్ట్ డాలీ జైన్ షేర్ చేసిన రీల్ లో దీపికా వృత్తి నైపుణ్యాన్ని ప్రశంసించింది. ఆమె 30 కిలోల లెహంగా ధరించి నాగడా సంగ్ ధోల్ లో గాయాలపాలైనా ఎలా బేర్‌ఫూట్‌తో డ్యాన్స్ చేసిందో గుర్తు చేసుకుంది. ప్రతికూల పీఆర్, ద్వేషపూరిత ప్రచారాలు ...