Hyderabad, సెప్టెంబర్ 18 -- 'కల్కి 2898 ఏడీ' సీక్వెల్ నుంచి దీపికా పదుకోన్ తప్పుకుందన్న వార్తలు గురువారం (సెప్టెంబర్ 18) సంచలనం రేపిన విషయం తెలుసు కదా. ఇది చాలా మందిని ఆశ్చర్యానికి గురిచేసింది. ఇప్పుడు ఈ సినిమా డైరెక్టర్ నాగ్ అశ్విన్ సోషల్ మీడియాలో ఒక అంతుబట్టని పోస్ట్ షేర్ చేశాడు. అది దీపికా గురించి అయి ఉండొచ్చని ఫ్యాన్స్ అనుకుంటున్నారు. ఇంతకీ ఆ పోస్టులో ఏముందో చూడండి.

గురువారం (సెప్టెంబర్ 18) నాగ్ అశ్విన్ ఇన్‌స్టాగ్రామ్‌లో 'కల్కి 2898 ఏడీ' లోని కృష్ణుడి ఎంట్రీ సీన్‌ను రీ-షేర్ చేశాడు. ఆ వీడియోను మొదట ఒక ఫ్యాన్ పేజ్ పోస్ట్ చేసింది. ఆ వీడియోలో.. "జరిగిపోయిన దానిని మీరు మార్చలేరు.. కానీ తర్వాత ఏం జరగాలో మీరు ఎంచుకోవచ్చు" అని రాసి ఉంది. ఆ వీడియోలో అశ్వత్థామతో కృష్ణుడు.. ఎవరి కర్మ వాళ్లు అనుభవించాల్సిందే అనే డైలాగ్ ఉంది.

చాలామంది ఇది దీపికా...