Hyderabad, అక్టోబర్ 9 -- జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మనకు మొత్తం 12 రాశులు ఉన్నాయి. రాశుల ఆధారంగా భవిష్యత్తు ఎలా ఉంటుంది అనేది తెలుసుకోవచ్చు. రాశుల ఆధారంగా ఒక వ్యక్తి తీరు, ప్రవర్తన ఎలా ఉంటాయన్నది కూడా చెప్పొచ్చు. ఇదిలా ఉంటే ఇక దీపావళి వస్తుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం దీపావళి నాడు రాశుల ప్రకారం కొన్ని వస్తువులను కొనుగోలు చేస్తే మంచి జరుగుతుంది. దీపావళి దీపాల పండుగ.

ప్రతి ఒక్కరూ కూడా సంతోషంగా ఈ పండుగను జరుపుకుంటారు. దీపావళి నాడు లక్ష్మీదేవి అనుగ్రహం పొందడానికి రకరకాల పరిహారాలను కూడా పాటిస్తూ ఉంటారు. అయితే దీపావళి నాడు మీ రాశి ప్రకారం కొన్ని వస్తువులను కొనుగోలు చేయడం శుభప్రదం. మరి ఏ రాశి వారు ఎటువంటి వాటిని కొనుగోలు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

మేష రాశి వారు దీపావళి నాడు వెండి లేదా వెండి నగలు లేదా వెండి పాత్రలు వెంటనే కొనుగోలు చేయడం మం...