Hyderabad, అక్టోబర్ 9 -- ప్రతి ఒక్కరూ దీపావళి పండుగను సంతోషంగా జరుపుకుంటారు. పిల్లలు, పెద్దలు కూడా సరదాగా ఈ పండుగను జరుపుకుంటారు. దీపావళి సానుకూల శక్తి, ధనం, ఐశ్వర్యం తీసుకు వస్తుందని నమ్ముతారు. లక్ష్మీదేవి అనుగ్రహం కలగడానికి ఆ రోజు కొన్ని ప్రత్యేకమైన పరిహారాలను కూడా పాటిస్తూ ఉంటారు. ఈ సంవత్సరం దీపావళి అక్టోబర్ 20న వచ్చింది. అలాగే ఇప్పటికే అందరూ వారి ఇంటిని శుభ్రం చేయడం మొదలు పెట్టి ఉంటారు. ఇల్లు, ఆఫీసు, షాపులు కూడా దీపావళికి శుభ్రం చేస్తారు.

దీపావళి నాడు అందమైన దీపాలు, లైటింగ్‌లు పెట్టి అలంకరిస్తారు. అయితే దీపావళికి ఆర్థిక ఇబ్బందులు లేకుండా, లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి సంతోషంగా ఉండాలంటే కొన్నింటిని తొలగించాలి. దీపావళికి ఇంటిని శుభ్రం చేసేటప్పుడు వీటిని తొలగించకపోతే ప్రతికూల శక్తి అలాగే ఉంటుంది, పేదరికంతో బాధపడాలి. సానుకూల శక్తి కలిగి లక్...