భారతదేశం, నవంబర్ 25 -- మతరపమైన దీక్షలపై తెలంగాణ పోలీస్ శాఖ ఇచ్చిన ఆదేశాలు ఇప్పుడు చర్చనీయాంశమైంది. మతపరమైన దీక్షలు తీసుకుంటే.. సెలవులు తీసుకోవాలని, డ్యూటీలో ఉండగా దీక్షలు చేయడానికి వీలు లేదని వెల్లడించింది. ఇందులో భాగంగా ఓ ఎస్సైకి మెమో కూడా జారీ చేశారు.

అయ్యప్ప దీక్షకు నల్లటి దుస్తులు ధరించడంతోపాటు జుట్టు, గడ్డం పెంచుకున్నందుకు సౌత్ ఈస్ట్ జోన్ అదనపు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ADCP) కే.శ్రీకాంత్.. కాంచన్‌బాగ్ సబ్-ఇన్‌స్పెక్టర్ ఎస్.కృష్ణకాంత్‌కు మెమో జారీ చేశారు. ఏడీసీపీ చర్యలపై పెద్ద ఎత్తున విమర్శలు కూడా వస్తున్నాయి. దీనిపై సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది.

పోలీస్ శాఖ ఇచ్చిన ఆదేశాలపై గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. నియమం ఒక నిర్దిష్ట సమాజానికి మాత్రమే వర్తిస్తుందో లేదో రాష్ట్ర ప్రభుత్వం నుండి తెలుసుకోవాలని కో...