Hyderabad, జూన్ 17 -- రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న నెక్ట్స్ మూవీ ది రాజా సాబ్. మారుతి డైరెక్షన్ లో హారర్ కామెడీ జానర్లో తెరకెక్కుతున్న ఈ సినిమా టీజర్ సోమవారం (జూన్ 16) రిలీజైన విషయం తెలిసిందే. మూవీ రిలీజ్ కానున్న ఐదు భాషల్లోనూ టీజర్ వచ్చింది. అన్నింట్లో కలిపి తొలి 24 గంటల్లోనే 59 మిలియన్ ప్లస్ వ్యూస్ సాధించినట్లు మేకర్స్ వెల్లడించారు.

ప్రభాస్ ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్లో నిజంగానే ది రాజా సాబ్ అనాలేమో. అతడు ఏ సినిమాలో నటించినా అది బాక్సాఫీస్ రికార్డులనే కాదు.. అంతకుముందు టీజర్, ట్రైలర్ లాంటి రికార్డులను కూడా తిరగరాస్తోంది. తాజాగా వచ్చిన ది రాజా సాబ్ టీజర్ కూడా తొలి 24 గంటల్లోనే ఐదు భాషల్లో కలిపి 59 మిలియన్లకుపైగా వ్యూస్ సంపాదించినట్లు ఆ సినిమా మేకర్స్ వెల్లడించారు. ఇండియన్ సినిమాలో బిగ్గెస్ట్ ఎవర్ హారర్ ఫ్యాంటసీ అంటూ ఈ మూవీని మేకర్స్ ప...