భారతదేశం, నవంబర్ 21 -- రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులకు పండగలాంటి న్యూస్. అతని నెక్ట్స్ మూవీ ది రాజా సాబ్ నుంచి ఓ కీలకమైన అప్డేట్ వచ్చేసింది. మారుతి డైరెక్షన్ లో వస్తున్న ఈ హారర్ కామెడీ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ రాబోతోంది. ఈ అనౌన్స్‌మెంట్ ను మేకర్స్ శుక్రవారం (నవంబర్ 21) ఓ స్పెషల్ పోస్టర్ ద్వారా చేశారు.

ప్రభాస్, మారుతి కాంబినేషన్ లో వస్తున్న ది రాజా సాబ్ సంక్రాంతి సందర్భంగా జనవరి 9న రిలీజ్ కానున్న నేపథ్యంలో మేకర్స్ ప్రమోషన్ల వేగం పెంచారు. రెబల్ సాబ్ పేరుతో ఫస్ట్ సింగిల్ తీసుకురానున్నారు. తమన్ మ్యూజిక్ అందించిన ఈ పాటను ఆదివారం (నవంబర్ 23) రిలీజ్ చేయనున్నారు.

శుక్రవారం (నవంబర్ 21) ఈ అనౌన్స్‌మెంట్ చేశారు. రిలీజ్ డేట్ ప్రకటనతో పాటు విడుదల చేసిన పోస్టర్‌లో ప్రభాస్ సరికొత్త స్టైలిష్ లుక్‌లో కనిపిస్తూ.. "ద మ్యాన్ ఆఫ్ స్వాగ్" అనే వైబ్‌ని క్రియేట్...