భారతదేశం, జనవరి 8 -- యంగ్ రెబల్ స్టార్, పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన లేటెస్ట్ హారర్ కామెడీ ఫాంటసీ థ్రిల్లర్ సినిమా ది రాజా సాబ్. కామెడీ సినిమాల డైరెక్టర్ మారుతి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ ముగ్గురు ముద్దుగుమ్మలు హీరోయిన్స్‌గా చేశారు.

పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, ఇవీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్స్‌పై నిర్మాతలు టీజీ విశ్వ ప్రసాద్, ఇషాన్ సక్సేనా నిర్మించారు. తమన్ ఎస్ మ్యూజిక్ అందించిన ది రాజా సాబ్ ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. ఇప్పటికే విడుదలైన ది రాజా సాబ్ ట్రైలర్, సాంగ్స్‌కు విపరీతమైన క్రేజ్ ఏర్పడింది.

ఇక సంక్రాంతి కానుకగా వరల్డ్ వైడ్‌గా జనవరి 9న ది రాజా సాబ్ సినిమా థియేటర్లలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ది రాజా సాబ్ ఫస్ట్ రివ్యూ అంటూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ వైరల్ అవుతోంది. బాలీవుడ్ క్రిటిక్‌గ...