భారతదేశం, జనవరి 9 -- రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న 'ది రాజా సాబ్' (The Raja Saab) ఎట్టకేలకు వెండితెరపై సందడి చేస్తోంది. 'కల్కి 2898 AD' లాంటి భారీ యాక్షన్ సినిమా తర్వాత ప్రభాస్ పూర్తిగా భిన్నమైన హారర్ కామెడీ జానర్‌లో కనిపించడంతో థియేటర్ల వద్ద పండగ వాతావరణం నెలకొంది.

ఇవాళ (జనవరి 9) థియేటర్లలో ది రాజా సాబ్ రిలీజ్ కానుండగా.. ఈపాటికే పలుచోట్ల ప్రీమియర్ షోలు పడ్డాయి. ఈ నేపథ్యంలో సినిమా చూసిన ప్రేక్షకులు తమ అభిప్రాయాలను సోషల్ మీడియా వేదికగా పంచుకుంటున్నారు. ఈ క్రమంలో ది రాజా సాబ్ ట్విటర్ రివ్యూలోకి వెళితే..!

ట్విట్టర్ (ఎక్స్) రివ్యూల ప్రకారం.. ది రాజా సాబ్ సినిమాలో ప్రభాస్ 'వింటేజ్ లుక్' అందరినీ కట్టిపడేస్తోంది. "డార్లింగ్ ప్రభాస్‌లో ఆ పాత ఎనర్జీని, కామెడీ టైమింగ్‌ని మళ్లీ చూస్తున్నాం. 'బుజ్జిగాడు', 'డార్లింగ...