భారతదేశం, జనవరి 7 -- ప్రభాస్ నటించిన ది రాజా సాబ్ మూవీ రిలీజ్ కు మరికొన్ని గంటలే మిగిలి ఉంది. ఈ నేపథ్యంలో ఏపీలో టికెట్ల ధరలు పెంచుకోవడానికి అనుమతి ఇస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. అయితే ఈ టికెట్ల ధరల పెంపు సాధారణం కంటే కూడా చాలా ఎక్కువగా ఉండటం గమనార్హం. అవి ఎలా ఉన్నాయో చూడండి.

ది రాజా సాబ్ టికెట్ల ధరలు పెంచుకోవడానికి ఏపీ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. బుధవారం (జనవరి 7) సాయంత్రం జీవో జారీ చేసింది. దీని ప్రకారం స్పెషల్ షోలకు ఏకంగా రూ.1000గా టికెట్ ధరను నిర్ణయించడం విశేషం. అంతేకాదు తొలి పది రోజుల పాటు రోజుకు ఐదు షోలతోపాటు టికెట్ల ధరలను పెంచుకోవడానికీ అనుమతి ఇచ్చారు.

ఈ జీవో ప్రకారం ఈ పది రోజుల పాటు సింగిల్ స్క్రీన్ అయితే ఒక్కో టికెట్ పై రూ.150, మల్టీప్లెక్స్ అయితే రూ.200 పెంచుకోవడానికి అనుమతి ఇవ్వడం గమనార్హం. దీంతో టికెట్ల ధర సింగిల్ స్క్రీన్...