భారతదేశం, జనవరి 3 -- యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న చిత్రం 'ది రాజా సాబ్'. కొత్త తరహా హారర్ కామెడీ ఫాంటసీ జోనర్‌లో వస్తున్న ది రాజా సాబ్ సినిమా జనవరి 9న థియేటర్లలో సందడి చేయనుంది.

ఈ నేపథ్యంలో ది రాజా సాబ్ దర్శకుడు మారుతి తాజాగా సినిమాలోని ఒక కీలక పాత్ర గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. బాలీవుడ్ వెండితెరపై విలక్షణ నటనకు మారుపేరుగా నిలిచిన బొమన్ ఇరానీ ది రాజా సాబ్‌లో సైకియాట్రిస్ట్ (మనోవైద్యుడు) పాత్రలో కనిపించనున్నారు.

బొమన్ ఇరానీ పాత్ర గురించి మారుతి మాట్లాడుతూ.. "ది రాజా సాబ్ సినిమాలో బొమన్ ఇరానీ పాత్ర ఎంతో కీలకం. ట్రైలర్‌లో చూసినట్లుగా ఆయన మేకోవర్ చాలా కొత్తగా ఉంటుంది. కథలో ఆయన పాత్ర ప్రవేశించిన తర్వాత సినిమా టోన్ ఒక్కసారిగా మారిపోతుంది. హారర్ కామెడీ నుంచి ప్రేక్షకులు ఊహించని ఒక కొత్త మలుపు ...