Hyderabad, జూన్ 16 -- ప్రభాస్ నటిస్తున్న ది రాజా సాబ్ మూవీ టీజర్ సోమవారం (జూన్ 16) రిలీజైన విషయం తెలుసు కదా. ఈ టీజర్ తో ఇన్నాళ్లుగా సినిమాపై ఉన్న అంచనాలు రెట్టింపయ్యాయి. దీంతో మూవీ తొలి రోజు బాక్సాఫీస్ వసూళ్లు మరోసారి రికార్డులను తిరగరాయడం ఖాయంగా కనిపిస్తోంది. అంతేకాదు ఈ సినిమాతో ప్రభాస్ ఇప్పటి వరకూ ఏ ఇండియన్ నటుడికీ సాధ్యం కాని రికార్డును అందుకోనున్నట్లు అంచనా వేస్తున్నారు.

ప్రభాస్ నటిస్తున్న ది రాజా సాబ్ మూవీ ఈ ఏడాది డిసెంబర్ 5న రిలీజ్ కానున్న విషయం తెలిసిందే. ఈ సినిమా కూడా ప్రభాస్ గత మూడు సినిమాల్లాగే ఇండియాలో తొలి రోజు రూ.50 కోట్ల ప్లస్ నెట్ వసూళ్లు సాధిస్తుందన్న అంచనాలు ఉన్నాయి. ఇప్పటి వరకూ ఏ ఇండియన్ నటుడు కూడా వరుసగా నాలుగు సినిమాల్లో తొలి రోజు రూ.50 కోట్ల ప్లస్ నెట్ వసూళ్లు సాధించలేదు.

ది రాజా సాబ్ కూడా తెలుగు సహా మొత్తం ఐదు భాషల...