భారతదేశం, జనవరి 9 -- ఈ ఏడాది సంక్రాంతి రేసులో వచ్చిన తొలి సినిమా ది రాజా సాబ్. భారీ అంచనాల మధ్య శుక్రవారం (జనవరి 9) రిలీజైన ఈ సినిమాకు మిక్స్‌డ్ నుంచి నెగటివ్ రివ్యూలే వచ్చాయి. అభిమానులు తప్ప న్యూట్రల్ ప్రేక్షకులు, క్రిటిక్స్ చాలా వరకు నెగటివ్ రివ్యూలే ఇచ్చారు. ఈ నేపథ్యంలో సంక్రాంతి బరిలో ఉన్న ఇతర సినిమాలకు ఇది వరంలా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. రెండేళ్ల కిందట వచ్చిన హనుమాన్, గతేడాది సంక్రాంతికి వస్తున్నాంలాగే ఈసారి కూడా సర్‌ప్రైజ్ హిట్ ఉంటుందన్న అంచనాలు పెరిగాయి.

ప్రభాస్ 'ది రాజా సాబ్' రివ్యూలు నేరుగా చిరంజీవి 'మన శంకర వరప్రసాద్ గారు' సినిమాకు ప్లస్ అయ్యేలా ఉంది. పండగకి ఒక పెద్ద సినిమా చూడాలనుకునే ఫ్యామిలీ ఆడియన్స్, మొదటి ఆప్షన్ నిరాశపరచడంతో, ఆటోమేటిక్‌గా రెండో పెద్ద సినిమా అయిన చిరంజీవి సినిమా వైపు చూస్తారు.

ఇప్పటికే చిరంజీవి సినిమా...