భారతదేశం, జనవరి 10 -- ప్రభాస్ లేటెస్ట్ మూవీ 'ది రాజా సాబ్' తొలి రోజు బాక్సాఫీస్ వద్ద దారుణమైన వసూళ్లు సాధించింది. సలార్, కల్కి సినిమాలతో పోలిస్తే వసూళ్లు చాలా తక్కువగా ఉన్నాయి. కల్కిలో సగం మాత్రమే రాగా.. గత ఆరేళ్లలో ప్రభాస్ ఇదే అతి తక్కువ కావడం గమనార్హం. హారర్-కామెడీ జానర్‌లో వచ్చిన ఈ సినిమా తొలి రోజు ఇండియాలో రూ. 45 కోట్లు నెట్ రాబట్టింది. అయితే ఐదు వారాలుగా బాక్సాఫీస్ ను ఏలుతున్న రణవీర్ సింగ్ సినిమా రికార్డును రాజా సాబ్ బ్రేక్ చేయడం విశేషం.

పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన హారర్ కామెడీ మూవీ 'ది రాజా సాబ్' ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకొచ్చింది. అయితే కలెక్షన్ల విషయంలో ప్రభాస్ గత చిత్రాలైన 'సలార్', 'కల్కి 2898 AD' స్థాయిని అందుకోవడంలో ఈ సినిమా వెనుకబడిందనే చెప్పాలి. ప్రముఖ బాక్సాఫీస్ ట్రాకర్ 'సాక్నిల్క్' ...