భారతదేశం, నవంబర్ 24 -- ఓటీటీ కంటెంట్ ఇటీవల ఎక్కువ అవుతోన్న విషయం తెలిసిందే. ఓటీటీలో అన్ని రకాల జోనర్ సినిమాలు, వెబ్ సిరీస్‌లు అలరిస్తున్నాయి. అయితే, ఇటీవలే బ్లాక్ బస్టర్ హిట్ స్పై యాక్షన్ థ్రిల్లర్ సిరీస్ ది ఫ్యామిలీ మ్యాన్ 3వ సీజన్ ఓటీటీ స్ట్రీమింగ్‌కు వచ్చింది.

అయితే, ది ఫ్యామిలి సీజన్ 3పై మిక్స్‌డ్ రివ్యూస్ వచ్చాయి. కథ కొంచెం రొటీన్‌గా ఉందని, ఈశాన్య రాష్ట్రాలపై చేయించే దాడుల సీక్వెన్స్ కొత్తగా ఉన్నాయని, డ్రామా బాగానే ఉందని పలువురు కామెంట్స్ చేశారు. అలాగే, ది ఫ్యామిలి సిరీస్‌కు హీరో అయిన శ్రీకాంత్ పాత్ర చేసిన మనోజ్ బాజ్‌పాయ్ యాక్టింగ్ అదిరిపోయిందని అభిమానులు మెచ్చుకున్నారు.

అయితే, ఎపిసోడ్స్ బాగానే ఉన్న ఎండింగ్ మాత్రం అసంపూర్ణంగానే వదిలేశారని చాలా మంది ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ అభిమానులు పెదవి విరిచారు. సోషల్ మీడియా వేదికగా కూడా ఈ విషయంపై...