భారతదేశం, అక్టోబర్ 28 -- అమెజాన్ ప్రైమ్ వీడియోలో మోస్ట్ సక్సెస్‌ఫుల్ వెబ్ సిరీస్ లలో ఒకటి ది ఫ్యామిలీ మ్యాన్. ఇప్పటికే రెండు సీజన్లు పూర్తి చేసుకున్న ఈ సిరీస్ ఇప్పుడు కొత్త సీజన్ తో రాబోతోంది. ఇందులో లీడ్ రోల్స్ పోషించిన ప్రియమణి, మనోజ్ బాజ్‌పాయీలతో కూడిన ఓ ఫన్నీ వీడియో ద్వారా ప్రైమ్ వీడియో రిలీజ్ డేట్ అనౌన్స్ చేసింది.

ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 3 స్ట్రీమింగ్ తేదీని ప్రైమ్ వీడియో ఎట్టకేలకు వెల్లడించింది. నవంబర్ 21 నుంచి ఈ మూడో సీజన్ రానున్నట్లు తెలిపింది. ఈ మేరకు మంగళవారం (అక్టోబర్ 28) ఓ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అందులో ప్రియమణి, మనోజ్ బాజ్‌పాయీలను ఓ ఫన్నీ అవతార్ లో చూడొచ్చు. "డార్లింగ్స్.. శ్రీకాంత్ కమ్‌బ్యాక్ టైమ్ వచ్చేసింది.. ది ఫ్యామిలీ మ్యాన్ ప్రైమ్ లో నవంబర్ 21 నుంచి" అనే క్యాప్షన్ తో ఓ వీడియో పోస్ట్ చేసింది.

ఈ వీడియో ...