India, Oct. 25 -- ది గర్ల్‌ఫ్రెండ్ ట్రైలర్ 'ది గర్ల్‌ఫ్రెండ్' ట్రైలర్‌ను చిత్ర నిర్మాతలు శనివారం విడుదల చేశారు. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రష్మిక మందన్న, దీక్షిత్ శెట్టి ప్రధాన పాత్రల్లో నటించారు. అను ఇమ్మాన్యుయేల్ మెరిసింది. ఇందులో రష్మిక పాత్ర ఒక గందరగోళ ప్రశ్నతో పోరాడుతుంది. ఆమె నిజంగా తన బాయ్‌ఫ్రెండ్‌ను ప్రేమిస్తోందా లేక ప్రేమ అనే భావనను మాత్రమే ప్రేమిస్తోందా? అనేది ఇంట్రెస్ట్ కలిగిస్తోంది.

చిన్న బ్రేక్ ట్రైలర్ ప్రారంభంలో రష్మిక పాత్ర భూమా తన బాయ్‌ఫ్రెండ్ విక్రమ్‌తో "ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం" అని కంగారుగా అడుగుతుంది. అది కేవలం విరామం కాదని, నిజమైన బ్రేకప్ అని ఆమె స్పష్టం చేస్తుంది. ఆ తర్వాత విక్రమ్ ఆమెకు మొదటిసారి ప్రపోజ్ చేసిన సన్నివేశం కనిపిస్తుంది. "ఎల్లుండి మంచి ముహూర్తం ఉంది. పెళ్లి చేసుకుందాం" అని అతను అంటా...