భారతదేశం, ఏప్రిల్ 21 -- బాలీవుడ్ నటి దిశా పటానీకి ఖుష్బూ పటానీ అనే సోదరి ఉన్నారు. ఆమె గతంలో భారత ఆర్మీలో ఆఫీసర్‌గానూ పని చేశారు. ప్రస్తుతం ఫిట్‍నెస్ కోచ్‍గా, వ్యాపారవేత్తగా ఉన్నారు. తాజాగా ఖుష్బూ పటానీ చేసిన ఓ పనికి చాలా ప్రశంసలు దక్కుతున్నాయి. తప్పిపోయిన ఓ పాప మళ్లీ తన తల్లి దగ్గరికి చేరేలా ఖుష్బూ సాయం చేశారు. ఆ వివరాలు ఇక్కడ చూడండి.

బరేలీలోని తమ ఇంటి సమీపంలో ఓ పాప తప్పిపోయి కనిపించిందని ఏప్రిల్ 20న ఖుష్బూ పటానీ ఇన్‍స్టాగ్రామ్‍లో వీడియో షేర్ చేశారు. ఖుష్బూ, ఆమె తల్లి కలిసి ఆ పాపను ఇంటికి తీసుకెళ్లారు. ఆహారం తినిపించారు. చికిత్స చేయించారు. ఆ తర్వాత ఆ పాపను పోలీసులకు అప్పగించారు.

ఇది జరిగిన రెండు గంటలకు అప్‍డేట్ ఇచ్చారు ఖుష్బూ పటానీ. ఆ పాప తల్లిదండ్రుల వివరాలు తెలిశాయని వెల్లడించారు. ఆ పాపను తల్లి తీసుకెళ్లారని తెలిపారు. ప్రయాణంలో ఉండగా ...