భారతదేశం, డిసెంబర్ 3 -- అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం పురస్కరించుకుని.. విజయవాడలో నిర్వహించిన కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా దివ్యాంగుల కోసం ఏడు వరాలు ప్రకటించారు. వారు ఏ రంగంలోనూ వెనకబడి ఉండకూడదని చెప్పారు. అన్ని విధాలుగా ప్రభుత్వం అండగా ఉంటుందని, ప్రోత్సాహం అందిస్తామని ముఖ్యమంత్రి భరోసా ఇచ్చారు. కొత్తగా ప్రకటించిన 7 వరాలు దివ్యాంగుల జీవితాల్లో వెలుగులు నింపుతాయని చెప్పారు.

దివ్యాంగులకు ప్రకటించిన ఏడు వరాల్లో ఏపీఎస్ఆర్టీసీలో ఉచిత ప్రయాణం ఉంది. దీని ద్వారా దివ్యాంగులు రాకపోకల ద్వారా అయ్యే ఖర్చు తగ్గనుంది. స్థానిక సంస్థలు, కార్పొరేషన్లు, పబ్లిక్ సెక్టార్ ఎంటర్ ప్రైజెస్‌లో కనీసం ఒక దివ్యాంగ ప్రతినిధిని నామినేట్ చేస్తామని సీఎం ఈ సందర్భంగా వెల్లడించారు. అంతేకాదు.. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకు ఆర్థిక సబ్సిడీ అందించన...