భారతదేశం, మే 20 -- రేవంత్ ప్రభుత్వం దివ్యాంగులకు శుభవార్త చెప్పింది. దశాబ్దాల సమస్యకు ముగింపు పలుకుతూ.. జీవో జారీ చేసింది తెలంగాణ ప్రభుత్వం. మంత్రి సీతక్క చొరవతో.. దివ్యాంగులకు వివాహ ప్రోత్సాహం అందనుంది. పెళ్లి చేసుకున్న జంటలో ఒక్కరు దివ్యాంగులుంటేనే.. గతంలో లక్ష రూపాయలు వివాహ ప్రోత్సాహం అందేది. ఇద్దరు దివ్యాంగులు పెళ్లి చేసుకుంటే.. వివాహ ప్రోత్సాహ పథకం వర్తించ లేదు.

ఈ సమస్యను గుర్తించి.. మహిళా శిశు, వయోవృద్ధులు, దివ్యాంగుల సంక్షేమ శాఖ మంత్రి సీతక్క ప్రత్యేక చొరవ చూపారు. దివ్యాంగుల సమస్యకు పరిష్కారం చూపుతూ.. జీవో జారీ అయ్యేలా చేశారు. ఇక నుంచి ఇద్దరు దివ్యాంగులు వివాహం చేసుకున్నా.. ప్రోత్సాహం అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. లక్ష రూపాయల ఆర్థిక సహాయం వర్తింప చేయాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు స్త్రీ, శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి అనితా రా...