భారతదేశం, నవంబర్ 18 -- దిల్లీ ఎర్రకోట సమీపంలో జరిగిన కారు పేలుడు ఘటన దేశవ్యాప్తంగా కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో 10మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. అనేక మంది గాయపడ్డారు. కాగా పేలుడు సమయంలో కారు నడుపుతున్న సూసైడ్​ బాంబర్​ డాక్టర్​ ఉమర్​ ఉన్​ నబీకి సంబంధించి ఒక వీడియో ఇప్పుడు ఆన్​లైన్​లో వైరల్​ అవుతోంది. "ఆత్మాహుతి దాడి" అన్న విషయాన్ని "తప్పుగా అర్థం చేసుకున్నారు" అంటూ అతను మాట్లాడుతుండటం ఆ వీడియోలో కనిపిస్తోంది.

నవంబర్ 10కి ముందే ఈ వీడియోను రికార్డ్ చేసి ఉండవచ్చని భావిస్తున్నారు. ఈ వీడియోలో నబీ ఒక గదిలో ఒంటరిగా కూర్చుని ఆత్మాహుతి దాడుల గురించి చర్చిస్తున్నాడు. ఇటువంటి దాడులకు సాధారణంగా ఉపయోగించే పదమైన 'ఆత్మహుతి దాడి'ని తప్పుగా అర్థం చేసుకున్నారని, దీనిపై చాలా విరుద్ధమైన అభిప్రాయాలు, అభ్యంతరాలు వచ్చాయని అతను చెప్పడం వినపడింది. ...