భారతదేశం, ఏప్రిల్ 22 -- ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు దిల్లీలో పలువురు కేంద్ర మంత్రులతో భేటీ అయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన పలు ప్రాజెక్టులు, కేంద్ర పథకాలపై కేంద్ర మంత్రులతో మంగళవారం చర్చించారు. విదేశీ పర్యటన ముగించుకుని సోమవారం రాత్రి దిల్లీ చేరుకున్న సీఎం చంద్రబాబు...నలుగురు కేంద్ర మంత్రులతో భేటీ అయ్యి పలు అంశాలపై చర్చించారు.

ముందుగా కేంద్ర జల్ శక్తి మంత్రి సి.ఆర్.పాటిల్ తో భేటీ అయిన చంద్రబాబు జల్ జీవన్ మిషన్ పథకానికి కేంద్ర నిధుల మంజూరుపై చర్చించారు. కేంద్ర పథకమైన జల్ జీవన్ మిషన్ ను రాష్ట్రంలో విస్తృత స్థాయిలో ఉపయోగించుకోవాలని భావిస్తున్న ముఖ్యమంత్రి....ఈ పథకానికి నిధుల విడుదలపై కేంద్ర మంత్రితో చర్చించారు.

అదే విధంగా రాష్ట్రాన్ని కరువు రహితంగా మార్చేందుకు ప్రతిపాదించిన పోలవరం-బనకచర్ల లింక్ ప్రాజెక్టుపైనా కేంద్ర జలశక్తి మంత్రికి వి...