భారతదేశం, డిసెంబర్ 1 -- దిత్వా తుపాను బలహీనపడి తీవ్ర వాయుగుండంగా కొనసాగుతోంది. అయితే రాబోయే 12 గంటల్లో వాయుగుండంగా బలహీన పడనుందని ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులు వెల్లడించారు. ఇది ప్రస్తుతం నైరుతీ, పశ్చిమ మధ్య బంగాళాఖాతాలను ఆనుకుని కొనసాగుతోందన్నారు. చెన్నైలో నిరంతరాయంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి, తుపాను తమిళనాడు, పుదుచ్చేరి తీరాలకు కనీసం 35 కి.మీ దూరంలో ఉంది. వర్షాల కారణంగా నగరంలోని అనేక ప్రాంతాలు జలమయం అయ్యాయి.

ఈ వాయుగుండం చెన్నై తీరానికి దగ్గరలో ఉత్తర దిశగా పయనిస్తోందని వాతావరణ శాఖ తెలిపింది. గంటకు ఐదు కిలోమీటర్ల వేగంతో కదులుతోంది. దీని ప్రభావం కారణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో మూడు రోజులు వర్షాలు కురవనున్నాయి. ఒకటి రెండు ప్రాంతాల్లో భారీ వర్షాలు పడనున్నాయి. నెల్లూరుకి 200 కిలో మీటర్ల దూరంలో తుపాను కేంద్రీకృతమై ఉంది. ...