భారతదేశం, నవంబర్ 30 -- నైరుతి బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న ఉత్తర శ్రీలంక, తమిళనాడు తీరాలలో దిత్వా తుపాను ప్రభావంతో ఆదివారం ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాలకు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున IMD రెడ్ అలర్ట్ జారీ చేసింది. దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్, నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాలకు భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది.

ప్రకాశం, అన్నమయ్య, వైఎస్ఆర్ కడప జిల్లాల్లో ఒకటి లేదా రెండు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. దక్షిణ కోస్తా ఆంధ్ర ప్రదేశ్, రాయలసీమలోని అనంతపురం, శ్రీ సత్యసాయి, కర్నూలు, నంద్యాలతోపాటుగా పల్నాడు, బాపట్ల, గుంటూరు జిల్లాల్లో ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్, రాయలసీమలో చాలా చోట్ల తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుము...