భారతదేశం, జనవరి 10 -- రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి దోహదపడే పెట్టుబడులను సాధించడమే ధ్యేయంగా దావోస్‌ పర్యటన ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరం (ప్రపంచ ఆర్థిక సదస్సు)-2026 సదస్సులో తెలంగాణ రైజింగ్ 2047 విజన్‌ను, దానికి అనుగుణంగా రూపొందించిన క్యూర్ (CURE), ప్యూర్ (PURE), రేర్ (RARE) ప్రణాళికలను ప్రపంచానికి పరిచయం చేయాలని అధికారులకు నిర్దేశించారు.

రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను 3 ట్రిలియన్ డాలర్ల స్థాయికి తీసుకెళ్లే లక్ష్యంతో ప్రభుత్వం పూర్తి నిబద్ధతతో ముందుకు సాగుతోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పునరుద్ఘాటించారు. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గడిచిన రెండేళ్లలో దావోస్‌ ప్రపంచ ఆర్థిక సదస్సు వేదికగా రాష్ట్రానికి లభించిన పెట్టుబడి హామీలు, ప్రతిపాదనల పురోగతితో పాటు తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్-2025లో ఆకర్షించిన పెట్టుబడులు ఇప్ప...