భారతదేశం, ఏప్రిల్ 23 -- ఆంటోనీ వ‌ర్గీస్ హీరోగా న‌టించిన మ‌ల‌యాళం మూవీ దావీద్ ఇటీవ‌ల జీ5 ఓటీటీలో రిలీజైంది. స్పోర్ట్స్ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్కిన గోవింద్ విష్ణు ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. లిజోమోల్ జోస్ హీరోయిన్‌గా న‌టించింది. మ‌ల‌యాళంలో బ్లాక్‌బ‌స్ట‌ర్‌గా నిలిచిన ఈ మూవీ ఎలా ఉందంటే..

ఆషిక్ అబు( ఆంటోనీ వ‌ర్గీస్‌) సెలిబ్రిటీల‌కు బౌన్స‌ర్‌గా ప‌నిచేస్తుంటాడు. కోపం ఎక్కువ‌. అదే అత‌డి ఉపాధికి అడ్డంకిగా మారుతుంది. అబుకు కూతురు కుంజిలి అంటే ప్రాణం. తండ్రిని హీరోలా భావిస్తుంటుంది కుంజిలి. ట‌ర్కీకి చెందిన ఇంట‌ర్నేష‌న‌ల్ బాక్సింగ్ ఛాంపియ‌న్ సైనుల్ అక్మ‌దేవ్ వెకేష‌న్ కోసం గ‌ర్ల్‌ఫ్రెండ్‌తో క‌లిసి కేర‌ళ‌కు వ‌స్తాడు. కేర‌ళ స్పోర్ట్స్ క్ల‌బ్ సైనుల్ కోసం ఓ స‌న్మాన వేడుక ఏర్పాటుచేస్తుంది.

ఈ వేడుక‌లో జ‌రిగిన గొడ‌వ‌లో ఆషిక్ అబు పంచ్ దెబ్బ‌కు సైనుల్ స్ప...