Telangana, సెప్టెంబర్ 6 -- ఖైరతాబాద్‌ బడా గణేశ్‌ శోభాయాత్ర కొనసాగుతోంది. వేలాది మంది భక్తుల మధ్య వైభవంగా ముందుకు సాగుతోంది. మధ్యాహ్నం 2 గంటలకు నిమజ్జనం పూర్తయ్యే అవకాశం ఉంది. ఎన్టీఆర్‌ మార్గ్‌లో 4వ నంబరు స్టాండులో నిమజ్జనం చేయనున్నారు.ఇందుకోసం అక్కడ బాహుబలి క్రేన్‌ను ఏర్పాటు చేశారు. ఎలాంటి ఇబ్బందులు రాకుండా చర్యలు చేపట్టారు.

వినాయక చవితి ఉత్సవాల ముగింపు సందర్భంగా శనివారం నగరంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా గణేష్ విగ్రహాల నిమజ్జనం కొనసాగుతోంది. నిమజ్జనం చివరి రోజున ఊరేగింపులు సజావుగా జరిగేందుకు పోలీసులు, ప్రభుత్వ అధికారులు ఏర్పాట్లు చేయడంతో ఇక్కడి ప్రసిద్ధ హుస్సేన్ సాగర్ సరస్సుతో పాటు ఇతర జలాశయాల్లో గణేష్ విగ్రహాలను నిమజ్జనం చేస్తున్నారు.

నిమజ్జన నిర్వహణకు పలు శాఖలు సమన్వయంతో హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు...