భారతదేశం, ఏప్రిల్ 29 -- హరియాణాలో అత్యంత దారుణ, అమానవీయ ఘటన జరిగింది. ఓ 35ఏళ్ల మహిళ, ఆమె 5ఏళ్ల కూతురిపై కొందరు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం 5ఏళ్ల చిన్నారిని హత్య చేశారు. ఈ అమానుష ఘటనకు పాల్పడిన నిందితుల్లో ఒక 13ఏళ్ల బాలుడు కూడా ఉన్నాడు!

హరియాణా జింద్​లో ఏప్రిల్​ 22 రాత్రి ఈ ఘటన జరిగింది. ముగ్గురు నిందితులు ఓ 5ఏళ్ల చిన్నారిని హత్య చేశారని, ఆ తర్వాత ఆమె తల్లిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని పోలీసు ప్రతినిధి అమిత్ ఖరాబ్ తెలిపారు.

మహిళపై సామూహిక అత్యాచారం, ఆమె ఐదేళ్ల కుమార్తె హత్య కేసులో ముగ్గురు పెద్దలు, ఒక మైనర్​ని జింద్ పోలీసులు అరెస్టు చేశారు. మైనర్ బాలుడు హత్యలో మాత్రమే పాల్గొన్నాడని, అతడిని సేఫ్​ హౌజ్​కి తరలించామని, ముగ్గురు పెద్దలను పోలీసు కస్టడీకి తీసుకున్నామని అధికారులు వివరించారు.

నిందితుల పేర్లు.. హమీద్ ఖాన్ (4...