భారతదేశం, జూన్ 24 -- మహారాష్ట్రలో అత్యంత దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది! నీట్​ మాక్​ టెస్ట్​లో తక్కువు మార్కులు వచ్చాయన్న కారణంతో సొంత కూతురిని దారుణంగా కొట్టి చంపేశాడు ఓ తండ్రి. అనంతరం పోలీసుల వద్ద నేరాన్ని అంగీకరించాడు.

మహారాష్ట్ర సాంగ్లీలో కొన్ని రోజుల క్రితం జరిగింది ఈ ఘటన. సాధ్న భోన్స్​లే ఒక టాపర్​! క్లాస్​ 10 బోర్డు పరీక్షల్లో 92.60శాతం సాధించింది. అనంతరం ఎంబీబీఎస్​ చేసేందుకు బైపీసీలో చేరింది. కాగా ఇటీవలే ఆమె నీట్​ (నేషనల్​ ఎలిజిబిలిటీ కమ్​ ఎంట్రెన్స్​ టెస్ట్​) మాక్​ టెస్ట్​ రాసింది. ఆ ప్రాక్టీస్​ టెస్ట్​లో ఆమెకు తక్కువ మార్కులు వచ్చాయి. ఇది ఆ 17ఏళ్ల బాలిక తండ్రి ధోందిరామ్​ భోన్స్​లేకి నచ్చలేదు.

ధోందిరామ్​ ఒక స్కూల్​ టీచర్​. తక్కువ మార్కులు వస్తే, నిరుత్సాహపడకుండా మళ్లీ ప్రయత్నించాలని చెప్పాల్సింది పోయి.. కన్న కూతురిని దారుణంగా కొట...