Hyderabad, సెప్టెంబర్ 18 -- బిగ్ బాస్ 9 తెలుగు సెప్టెంబర్ 7న ప్రారంభమైన విషయం తెలుసు కదా. అయితే ఈ కొత్త సీజన్ లాంచ్ ఎపిసోడ్ ఆర్గనైజర్లను దారుణంగా నిరాశ పరిచింది. ఈ ఎపిసోడ్ కు కేవలం 9.07 రేటింగ్ మాత్రమే నమోదవడం గమనార్హం. గత కొన్ని సీజన్లతో పోలిస్తే ఇది చాలా చాలా తక్కువ.

బిగ్ బాస్ 9 తెలుగు కొత్త సీజన్ లో కామనర్స్ కూడా ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈసారి అగ్నిపరీక్ష, బిగ్ బాస్ మారిపోయాడు, రెండేసి హౌస్‌లు, రణరంగమే అంటూ ఎన్ని ప్రమోషన్లు ఇచ్చిన ప్రేక్షకుల్లో ఆసక్తి రేకెత్తించలేకపోయింది.

దీంతో లాంచ్ ఎపిసోడ్ కు 9.07 మాత్రమే రేటింగ్ వచ్చింది. కేవలం అర్బన్ రేటింగ్ చూసుకున్నా.. 11.37గా ఉంది. గత సీజన్ తో పోలిస్తే ఇది సగం కూడా లేదు. బిగ్ బాస్ 8 తెలుగు సీజన్ లాంచ్ ఎపిసోడ్ కు ఏకంగా 18.9 రేటింగ్ రావడం విశేషం. ఈ సీజన్ రేటింగ్ కచ్చితంగా ఆర్గనైజర్లకు మిం...